భారత్–బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) అమలుకు కట్టుబడి ఉన్నట్లు బ్రిటన్ నూతన ప్రధాని రిషీ సునాక్ మరోమారు స్పష్టం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తమ నిర్ణయం ఉండనున్నట్లు పేర్కొన్నారు. విదేశాంగ విధానంపై వివిధ దేశాల అతిథులు, ఆర్థిక నిపుణులు పాల్గొనే వార్షిక లండన్ మేయర్ బ్యాంకెట్ కార్యక్రమంలో సోమవారం సునాక్ ప్రసంగించారు. స్వేచ్ఛా, పారదర్శకతల్లో బ్రిటన్ విధానాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రాక ముందు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టానని సునాక్ వివరించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం తప్పనిసరన్నారు.