ప్రధానమంత్రి ముక్తిభారత్ లో భాగంగా వల్లూరు మండల పరిధిలోని క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం వల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈశ్వర్ రెడ్డి ఫౌండేషన్ ఫౌండర్ అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా మందుల కిట్ పంపిణీ చేసినట్లు వల్లూరు సర్పంచ్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తండ్రి ఈశ్వర్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ ఫౌండేషన్ ను ప్రారంభించినట్లు తెలిపారు. డాక్టర్ ప్రసన్నలక్ష్మి, టీబీ సూపర్వైజరు సునీల్, మధుసూదన్ రెడ్డి, విశ్వ నాథరెడ్డి, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.