తక్కువ పెట్టుబడితో లక్షల్లో ఆదాయం ఇస్తున్న సెరికల్చర్ వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. పట్టు పురుగుల పంట కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. రూ.800లు ధర ఉండే ఒక్కో పట్టుగుడ్లలో దాదాపు 500ల పిల్లలు ఉంటాయి. నల్లని వస్త్రాలపై వీటిని పొదగాల్సి ఉంటుంది. వీటి పెంపకం 5 దశల్లో ఉంటుంది. పట్టుపురుగులు మల్బరీ ఆకులను తింటాయి. 3 రోజులకు ఓ సారి ఇవి నిద్రలోకి వెళ్తాయి. అప్పుడు పట్టుపురుగులకు కొత్త చర్మం వస్తుంది. పెరిగిన పట్టు పురుగులు కిలో రూ.750కు రైతులు విక్రయిస్తున్నారు. 250 గుడ్లతో రైతులు పట్టుపురుగులు పెంచితే నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది.