ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 4 ఏపీఎస్పీ పోలీసు బెటాలియన్లను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఎచ్చెర్ల(శ్రీకాకుళం), రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి), మద్దిపాడు(ప్రకాశం), చిత్తూరులో నూతన బెటాలియన్ల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పోలీసు బెటాలియన్ల సంఖ్య 12కు చేరనుంది. ఒక్కో బెటాలియన్ లో ఏపీఎస్పీ అధికారులు, పోలీసులతో కలిపి 1,007 మందితో ఒక్కో బెటాలియన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.