తనను ఓడిస్తారన్నభయంతోనే జగన్ రెడ్డి టీచర్లను ఎన్నికల విధులకు దూరం చేశారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉపాధ్యాయులు చేసిన తప్పేంటో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. మెరుగైన ఫిట్ మెంట్ కావాలని, డీఏలు సకాలంలో ఇవ్వాలని, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేయాలని కోరడమే వారితప్పా అని నిలదీశారు. ఎన్నికల్లో ఏనేరం ఘోరం చేయడానికి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిసాయంతో అక్రమాలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి హామీలతో మోసపోయిన ఒక్కో టీచర్ 1000 మందిని ప్రభావితం చేయగలడని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.