తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం లిఫ్ట్ లో చిక్కుకోవడం అధికారులను కాసేపు కంగారు పెట్టించింది. చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిని మంగళవారం నాడు మంత్రి పరిశీలించారు. కొన్ని వార్డులను తనిఖీ చేసిన అనంతరం మూడో అంతస్తు నుండి కిందకి వచ్చేందుకు లిప్ట్ ఎక్కారు. అయితే లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. ఇంతలో మంత్రి లిఫ్ట్ లో ఎమర్జెన్సీ అలారం మోగించడంతో భద్రతా సిబ్బంది హుటాహుటీన సాంకేతిక సిబ్బందిని రప్పించి ఎమర్జెన్సీ తలుపు తెరిపించి మంత్రిని, ఆయన వెంట ఉన్న అధికారులను బయటకు తీశారు. మంత్రి లిఫ్ట్‌లో చిక్కుకోగానే భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఆయన క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.