శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని ఓ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగింది. లావేరు మండలంలోని మురపాక పంచాయితీలోని గుంటుకుపేటలోని మద్యం దుకాణం వద్దకు అర్ధరాత్రి దాటాక పదకొండు మంది వచ్చారు. అక్కడ కాపలాగా ఉన్న ప్రసాద్, దుర్గారావులను సమీపంలోని తోటలోకి తీసుకెళ్లి వారి సెల్ ఫోన్లు, బైకు తాళాలు లాక్కొని బంధించారు. అనంతరం దుకాణం గోడకు రంధ్రం చేసి అందులోంచి 7087 మద్యం సీసాలను దోచుకున్నారు. వీటి విలువ రూ.11.57 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు బృందాలతో గాలింపు చేపట్టారు.