ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేసి బాత్రూం ట్యాంక్లో పడేసిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. అక్టోబరు 18న బిహార్లోని నలందాలో జరిగిన ఈ దారుణ ఘటన గురించి పోలీసులు కీలక ఆధారాలు రాబట్టారు. పిను దేవి అనే 30 ఏళ్ల వితంతువు టీ కొట్టు నడుపుతుండేది. దుకాణం దగ్గరకి వచ్చే నలుగురు వ్యక్తులు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. వీరంతా 60 ఏళ్లు పైబడినవారే కావడం గమనార్హం. అయితే కొన్నాళ్ల తర్వాత తృపిత్ శర్మ అనే వృద్ధుడు పిను దేవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది చూసి ఆ నలుగురూ ఆమెను హెచ్చరించారు. ఈ క్రమంలో నలుగురు ప్రియులతో కలిసి వృద్ధుడిని హతమార్చాలనుకుంది పిను దేవి. వృద్ధుడిని ఇంటికి పిలిపించి నలుగురు ప్రియులతో అతనిపై రాళ్ల దాడి చేసి చంపించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.