భారతీయ రైల్వేశాఖ నేడు భారీగా రైళ్లను రద్దు చేసింది. వివిధ కారణాల వల్ల నేడు ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. రైల్వే ట్రాక్ పనుల నిర్వహణ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్లు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తెలిపింది. మరో 55 రైళ్లను దారి మళ్లించామని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. 26 రైళ్ల స్టేషన్లను మార్చామని, 17 రైళ్లను రీషెడ్యూల్ చేశామని తెలిపారు. ప్రయాణికుల టిక్కెట్లు ఆటోమేటిగ్గా క్యాన్సిల్ అవుతాయని, వాటికి సంబంధించిన నగదు యూజర్ల అకౌంట్లలోకి రీఫండ్ అవుతుందని తెలిపారు.