సెంట్రల్ అమెరికాలోని కోస్టారికా దేశంలో విషాధకర ఘటన జరిగింది. మాటినా అనే నది వద్ద విహారానికి వచ్చిన జూలియో ఒటెరో ఫెర్నాండెజ్ (8) అనే బాలుడిని అక్టోబర్ 30న మొసలి తినేసింది. తమ కళ్ల ముందే ఇది జరుగుతుంటే తల్లిదండ్రులు నిస్సహాయంగా చూశారు. తాజాగా ఆ మొసలిని గుర్తు తెలియని వ్యక్తి చంపేశాడు. శనివారం మొసలిని కోసి చూడగా జూలియో ఒటెరో ఫెర్నాండెజ్ జుట్టు, ఎముకలు లభ్యం అయ్యాయి. దీనిపై బాలుడి తండ్రి డాన్ జూలియో ఒటెరో స్పందించారు. 'నా కొడుకు శరీరంతో మొసలి తేలుతూ ఉండటం చూసి కన్నీళ్లు ఆగలేదు' అని పేర్కొన్నారు.