సంక్రాంతికి ఊరెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. రానుపోను టిక్కెట్ ను ముందుగానే బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో టిక్కెట్టుపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతేకాకుండా సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయడం లేదని తెలిపింది. గత దసరా సీజన్లో నడిపిన స్పెషల్ బస్సులకు ఆర్టీసీ ఆదనపు ఛార్జీలను వసూలు చేయలేదు. ఇది ప్రయాణికుల ఆదరణను చూరగొంది. దీంతో ఈ సంక్రాంతి సీజన్లోనూ ఆదనపు ఛార్జీలు లేకుండా బస్సులు నడుపనుంది. కాగా, సంక్రాంతి పండుగకు ఊరెళ్లేవారి కోసం ఆర్టీసీ ఆన్ లైన్ బుకింగ్స్‌ను ఇటీవలే ప్రారంభించింది.