బెంగళూరులోని పలు పాఠశాలల్లో అధికారులు చేసిన తనిఖీలలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. 8, 9, 10 చదివే విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్‌లు, సిగరెట్లు, లైటర్లు, గర్భనిరోధక మాత్రలు, వాటర్ బాటిళ్లలో మద్యం లభ్యం అయ్యాయి. దీంతో పలు పాఠశాలలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కొన్ని స్కూళ్లు పేరెంట్స్ మీటింగ్స్ పెట్టగా, కొన్ని స్కూళ్లకు యాజమాన్యాలు 10 రోజుల సెలవులు ప్రకటించాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలపగా వారు కూడా షాక్ అయ్యారన్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు పలు పాఠశాలల ప్రిన్సిపాల్స్ వెల్లడించారు.