సాధారణంగా అలసిపోయినపుడు లేదా తలనొప్పి ఉన్నపుడు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవటం వల్ల ఆ సమస్య ఎక్కువ అవుతుందట. క్యాబేజీ, బెండకాయ, ఫ్రోజెన్ ఫిష్, వేరుశెనగ వంటి ఆహారాల్లో టైరమైన్ ఉంటుంది. ఇది తలనొప్పిని ట్రిగర్ చేస్తుందట. ఎక్కువగా తలనొప్పితో బాధపడేవారు, మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ స్వీటెనర్ ఎక్కువగా తీసుకునే వారిని తలనొప్పి సమస్య వేధిస్తుందట. ఇక దీనిలో ఉండే.. అస్పర్టమే డోపమైన్ స్థాయిలను బాగా తగ్గించి తలనొప్పిని ప్రేరేపిస్తుంది. అలాగే సిట్రస్ పండ్లు, జున్ను వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.