పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్లు అనారోగ్యానికి గురవడం కలకలం రేపింది. 16 మందిలో 13 మంది అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది కరోనా వైరస్ కాదని.. ఆ లక్షణాలు లేవని ఆ జట్టు ప్రకటించింది. క్రికెటర్లు వాంతులు, డయేరియాతో బాధ పడుతున్నారని పేర్కొంది. ఆ వైరస్ 24 గంటల్లో నయమవుతుందని తెలిపింది. ఇది ఏ వైరస్ అనేది క్లారిటీ లేదు. ఈ క్రమంలో గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు వాయిదా పడే అవకాశం ఉంది.