భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. దీంతో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ను న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందగా, మిగతా రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దయ్యాయి. నేటి మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 రన్స్ కి ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 రన్స్ చేసింది. వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు.