పాక్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో నేడు ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో ముగ్గురు మృతిచెందగా, 20 మంది భద్రతా సిబ్బంది సహా 23 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడుకు కనీసం 25 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు, పేలుడు కారణంగా ట్రక్కు బ్యాలెన్స్ కోల్పోయి లోయలో పడిందని క్వెట్టా డీఐజీ గులాం అజ్ఫర్ మహేసర్ తెలిపారు. ఘటన స్థలంలో ఆత్మాహుతి బాంబర్ అవశేషాలను గుర్తించామని, ఇది ఆహ్మాతులి దాడిగా భావిస్తున్నామని డీఐజీ వెల్లడించారు. ఈ ఘటనలో 20 మంది పోలీసులు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.