గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో సుమారు రూ.500 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఫ్యాక్టరీల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసుల సాయంతో ATS అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 500 కోట్ల విలువైన ఘన, ద్రవ రూప మాదకద్రవ్యాల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముడిసరుకును అహ్మదాబాద్, ముంబై, కచ్‌లకు పంపిస్తున్నట్లు సమాచారం. ముడి పదార్థం టాబ్లెట్ రూపంలో అమ్మేలా వీటిని తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి డ్రగ్స్ కు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.