అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులకు ఈడీ షాకిచ్చింది. వీరి సంస్థలకు చెందిన రూ.22.10 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దివాకర్ రోడ్ లైన్స్, జఠాదర ఇండస్ట్రీస్ సంస్థలకు చెందిన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. బీఎస్ 4 వాహనాల కుంభకోణంలో ఈ అటాచ్ మెంట్ ను చేసినట్లు తెలుస్తోంది. జేసీ సోదరులు బీఎస్ 3 వాహనాలను స్క్రాప్ లో కొనుగోలు చేసి, తప్పుడు ధృవీకరణ పత్రాలతో బీఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.