రష్యాలోని యకుటియాలో ఉన్న యూకెచీ అలాస్ సరస్సు నుంచి ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రమాదకర జాంబీ వైరస్‌ను కనుగొన్నారు. మంచులో కూరుకుపోయిన 13 రకాల "జాంబీ వైరస్‌లు"ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో ఒకటైన పండోరవైరస్ యెడోమా 48,500 ఏళ్ల కంటే పాతదని తేలింది. మిగిలినవి కూడా 10 వేల ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 'బయోఆర్‌క్సివ్' జర్నల్‌లో తమ అధ్యయనాన్ని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటికి కరోనా తరహాలో ప్రమాదకర మహమ్మారిగా మారే శక్తి ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.