కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆర్ధిక ఇబ్బందులని తొలగించేందుకు పలు రకాల స్కీమ్‌లను తీసుకు వచ్చింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్ళ కోసం ‘ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన’ స్కీమ్ ని తెచ్చింది. ఈ పథకం కింద కార్మికులు కనీసం రూ.3000 వరకు పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పెన్షన్ 60 సంవత్సరాలు నిండినప్పుడు వస్తుంది. ఒకవేళ కనుక పెన్షనర్ మరణిస్తే అతని భార్య లేదా భర్త కుటుంబానికి సగం డబ్బులు వస్తాయి. ప్రతి నెలా మాన్ ధన్ యోజనలో 100 రూపాయలు కడితే అవి లబ్ధిదారుని ఖాతాలోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇది 60 సంవత్సరాల వయసు వరకు కట్టాలి.