బీహార్లోని నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవతారి గ్రామానికి చోటూ కుమార్ 4 రాష్ట్రాలలో ఆరుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అతడికి మొదటి భార్యతో నలుగురు పిల్లలు, రెండో భార్య మంజుతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. చోటూను జాముయి రైల్వే స్టేషన్లో మరో మహిళతో ఉండడం మంజు సోదరుడు వికాస్ ఇటీవల చూశాడు. పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఎక్కడకు వెళ్లినా అక్కడ ఓ మహిళను చోటూ పెళ్లి చేసుకున్నాడని, వారందరితో పిల్లలు కన్నాడని పోలీసులు వెల్లడించారు. పెళ్లి చేసుకున్నాక పారిపోవడమే అతడి నైజమన్నారు.