మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా... మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువే. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని చెప్పారు. విద్యాదీవెనకు తోడు జగనన్న వసతి దీవెన ఇస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చాం. పేదలకు చదువును హక్కుగా మార్చామని చెప్పారు. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించాం. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించామన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇవాళ జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.684 కోట్లు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేశారు.