చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణం. అలాంటి సమయంలో వెల్లుల్లిని మనం ఆహారంలో తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిని నమలడం లేదా చూర్ణం చేయడం వల్ల తెల్ల రక్త కణాల సామర్థ్యం పెరుగుతుందని చెబుతారు. వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు బిపి నియంత్రణతో సహా గుండె జబ్బులను నివారించడానికి దివ్యౌషధమని పేర్కొన్నారు.