ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడి కూసిందని కేసు పెట్టిన మోడీ...స్వీకరించిన పోలీసులు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:27 AM

కొన్ని కేసులు విచిత్రంగా ఉన్నా వాటిని పోలీసులు సైతం స్వీకరించాల్సిన పరిస్థితి. పొద్దున్నే కోడి కూత పెట్టడం కామన్. గ్రామాల్లో అయితే కోడి కూతే అలారం. కోడి కూత పెట్టగానే ప్రజలు నిద్ర లేచి.. ప్రజలు తమ పనులు మొదలుపెడతారు. అలాంటిది కోడి కూసిందని ఓ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విస్తుపోయే ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. అలోక్ మోడీ అనే వ్యక్తి పాలసియా ప్రాంతంలోని గ్రేటర్ కైలాశ్ ఆస్పత్రి సమీపంలో సిల్వర్ ఎన్‌క్లేవ్స్‌లో జీవిస్తున్నారు.


అలోక్ మోడీ ఓ కేన్సర్ డాక్టర్. రోజంతా డ్యూటీ, ఆపరేషన్లు చేసి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తాడు. పొద్దుట వరకు నిద్ర లేవ లేడు. అయితే తన ఇంటి దగ్గర ఉన్న వందన విజయన్ అనే వ్యక్తికి చెందిన ఓ కోడి రోజూ తెల్లవారుజామునే కూస్తూ మోడీ నిద్రకు ఆటంకం కలిగించేది. దాంతో మోడీకి విపరీతమైన కోపం వచ్చేది. దాంతో ఆ కోడిని బోనులో పెట్టి ఉంచమని విజయన్‌కు సలహా ఇచ్చాడు. కానీ అది అతని వల్ల కాలేదు. దీంతో ఆ కోడి ఉదయం పూట కూస్తూనే ఉంది. దాంతో విసిగిపోయిన మోడీ.. చేసేదేం లేక పాలసియా పోలీసులను ఆశ్రయించాడు.


తన నిద్రకు భంగం కలిగిస్తోందని కోడి మీద ఫిర్యాదు చేశాడు. రోజంతా ఆస్పత్రిలో డ్యూటీ చేసి అలసిపోయి రాత్రి ఇంటికొచ్చి పడుకుంటానని, అయితే తన ఇంటికి సమీపంలో ఉన్నందున విజయన్‌కు చెందిన కోడి రోజూ తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటల మధ్య కూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ కంప్లైంట్‌ని పోలీసులకు స్వీకరించారు. అంతేకాదు కోడి యజమాని వందన విజయన్‌పై సెక్షన్‌ 138 కింద కేసు పెట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com