కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయాలు, పరిసర ప్రాంతాల్లో హైఫ్రీక్వెన్సీ 5జీ సేవలను నిలిపివేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. డీజీసీఓ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 3.3- 3.6 గిగాహెర్జ్ సామర్థ్యం కలిగిన 5జీ నెట్ వర్క్ సేవలను విమానాశ్రయాలకు రెండు కిలోమీటర్ల పరిధి వరకు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.