ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో గాయాలు, హింస వల్ల నిత్యం 12 వేల మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ చనిపోతున్నవారు ఎక్కువగా 5-29 ఏళ్ల వారే కావటం గమనార్హం. ‘గాయాల నియంత్రణ, సురక్షిత చర్యలు’ పై ఆస్ట్రేలియాలో జరుగుతోన్న 14వ అంతర్జాతీయ సదస్సులో విడుదల చేసిన నివేదికలో WHO ఈ వివరాలు తెలిపింది. యాక్సిడెంట్స్ లో తీవ్రంగా గాయపడటం, మర్డర్, సూసైడ్ వంటి మూడు కారణాలతోనే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారట. వీటితోపాటు నీటిలో కొట్టుకుపోవడం, కాలిన గాయాలు వంటి మరిన్ని కారణాలతో చనిపోతున్నారని పేర్కొంది.