ప్రముఖ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు పీలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 82 ఏళ్ల పీలే అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శరీరంపై వాపులు రావడంతో పీలే ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అయితే తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని పీలే కుమార్తె కిల్లీ వెల్లడించింది. బ్రెజిల్ దేశానికి చెందిన పీలే ఫుట్ బాలో లో మూడు వరల్డ్ కప్ లు గెలిచిన ఏకైక ఆటగాడు కావడం గమనార్హం.