మలబద్ధకం దీర్ఘకాలం కొనసాగితే అది పైల్స్ వంటి వ్యాధులకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్డ్, ప్యాకేజ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల చాలా మందికి మలబద్ధకం సమస్య ఎదురవుతోంది. మెరుగైన జీవనశైలితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తినాలి. రోజూ సరిపడా నీరు తాగాలి. నిత్యం పండ్లు, ఆకు కూరలు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.