ఉపాధ్యాయులకు ఉద్యోగులు వారు దాచుకున్న సొమ్మును విడుదల చేయమని అడిగి దాని కోసమని విజయవాడలో ధర్నాకు అనుమతి తీసుకుని ధర్నాను చేపట్టే సందర్భంలో అప్పటికప్పుడు అనుమతిని రద్దు చేసి యుటిఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకత్వాలను అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ బద్వేల్ గోపవరం మండల యూటీఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ పిఆర్సి జరిగినప్పటినుండి ఇంతవరకు ఉద్యోగులకు రావలసిన బకాయిలను ఏమాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిని విడుదల చేయాలని ఉపాధ్యాయుల మరి ఉద్యోగుల కనీస హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి గోపవరం మండల అధ్యక్ష కార్యదర్శులు కంచిరెడ్డి, క్రిష్టిపర్ మరియు బద్వేల్ మండల యుటిఎఫ్ అధ్యక్షులు శివప్రసాద్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ మద్దతు ఇచ్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కే రమేష్ యాదవ్, జిల్లా నాయకులు బాలయ్య ఈ శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.