సబ్బవరం మండల కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బముగా గురువారం
ఐ సి టి సి వారి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని పి హెచ్ సి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్బముగా చక్రవర్తి మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఐ సి టి సి కౌన్సలర్ రాజశేఖర్ మాట్లా డుతూ హెచ్ ఐ వి తో జీవిస్తున్న వారితో సంఘీభావం తో మెల గాలని అన్నారు. హెచ్ ఐ వి తో జీవిస్తున్నవారికి ఉచితంగా మందులు అందజేస్తూ వారు ఆనందంగా జీవించేందుకు కౌన్స్లింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.
అసమానతలను అంతం చేయడానికి అందరం ఏకమవుదాం అనే నినాదానాలుతో ర్యాలీ నిర్వహించి అనంతరం మూడురోడ్లు కూడలి లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు డాక్టర్ కన్నం నాయుడు, పి హెచ్ ఎన్ రమణమ్మ, ఎమ్ పి హెచ్ ఈ ఓ జేసుదాస్, ఎల్ టి ఎ కె నీలిమ, పాల్గుణ, రాంబాబు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు సూర్యనారాయణ, నానాజి, ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.