తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పంపిణీ చేసే రసీదులు తమిళంలోనే ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమిళాభివృద్ధి శాఖ సూచనల మేరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ, యూనియన్, గ్రామ పంచాయతీలు సహా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇచ్చే రసీదులు తమిళంలోనే ముద్రించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మదురై ముత్తుపట్టి ఇండియన్ కురల్ సంఘ ఆర్గనైజర్ మోహన్‌కు ఇచ్చిన ఇంటి పన్ను, తాగునీటి పన్ను రసీదులు ఆంగ్లంలో ఉండడంతో ఆయన తమిళాభివృద్ధి శాఖ డైరెక్టర్ మోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన తమిళాభివృద్ధి శాఖ ఇకపై ఆంగ్లంలో ముద్రించిన రసీదులను వినియోగించరాదని, తమిళంలోనే ముద్రించి ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది.