ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకురావాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా యాప్ ఉండాలని, ఆరోగ్య శ్రీ సేవలపై ప్రజలకు అవగాహన కల్పంచాలని, సేవల విషయంలో ఏదైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందో ఆ వివరాలు, ఆసుపత్రి లొకేషన్ తో పాటు డైరెక్షన్ చూపేలా యాప్ లో మ్యాప్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ఉగాది నాటికి విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.