దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. నెన్సెక్స్ 268 పాయింట్లు నష్టపోయి 63,015 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 77 పాయింట్లు నష్టపోయి 18.734 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.10 వద్ద ట్రేడవుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్ లాభాల్లో ఉండగా, మారుతీ, హెచ్ యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్ డీఎఫ్ సీ, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.