పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. మున్సిపాలిటీలోని 12 సచివాలయాల పరిధిలో 4868 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 12. 80 కోట్లు మంజూరు చేసింది. వీటిని వాలంటీర్లు తమ పరిధిలోని లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. సాంకేతిక కారణాలు, అందుబాటులో లేని వారికి తప్ప మిగిలిన అందరికీ వేకువజాము నుంచే పంపిణీ చేసేలా చొరవ చూపారు.