మహిళా ప్రొఫెసర్‌పై లైంగిక దాడికి పాల్పడిన HODని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఈ ఘటన జరిగింది. నిందితుడిని ప్రమోద్ కుమార్ మోదీగా పోలీసులు గుర్తించారు. బాధిత ప్రొఫెసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. రెండేళ్లుగా అతడు తనను వేధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.