ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా డిసెంబరు 19వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. రెగ్యులర్ విద్యార్థులు, ఇంతకుముందు ఫెయిల్ అయినవాళ్లు, హాజరు మినహాయింపు కోరిన ప్రైవేటు విద్యార్థులు, గ్రూప్ చేసుకున్న విద్యార్థులు ఈ గడువులోగా ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.