ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వేలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ నిలిచింది. గత పదేళ్లలో ఎనిమిది సార్లు అత్యంత ఖరీదైన నగరంగా ఉన్న సింగపూర్ తో కలిసి న్యూయార్క్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం గరిష్ఠాలకు చేరడంతో న్యూయార్క్ జీవనం మరింత ఖరీదుగా మారిపోయింది. గతేడాది మొదటి స్థానంలో ఉన్న టెల్ అవీవ్ నగరం ఈ ఏడాది మూడో స్థానానికి పరిమితమైంది. హాంగ్ కాంగ్ 4, లాజ్ ఏంజెలెస్ 5, జూరిచ్ 6, జెనీవా 7, శాన్ ఫ్రాన్సిస్కో 8, ప్యారిస్ 9, సిడ్నీ, కోపెన్ హెగెన్ 10వ స్థానాల్లో ఉన్నాయి.