దేశంలో నానాటికి పెరిగిపోతున్న వాయు కాలుష్యం మనిషి ఉసురు తీస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా మారుతుంది. ఈ విషయాన్ని ‘అసోసియేటెడ్ చాంబర్స్ కాఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా’ సదస్సులో నిపుణులు పేర్కొన్నారు. భూమిపై 100 అత్యంత కాలుష్య ప్రాంతాల్లో 63 భారత్ నుంచే ఉన్నట్టు ఈ సదస్సు పేర్కొంది. దేశంలో కొత్తగా వచ్చే కేన్సర్ కేసుల్లో 6.9 శాతం లంగ్ కేన్సర్‌కు సంబంధించినవేనట . కేన్సర్ మరణాల్లో 9.3 శాతం దీనివల్లేనని సదస్సులో పాల్గొన్న నిపుణులు గణాంకాలను ప్రస్తావించారు. ముందుగా స్క్రీన్ చేయించుకుని గుర్తించగలిగితే, లంగ్ కేన్సర్ లోనూ ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.