యూఎస్ లోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు ఓ కొత్త పోస్టు సృష్టించారు. ఈ ఉద్యోగికి వార్షిక వేతనం రూ.కోటీ 38 లక్షల 55 వేలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఎలుకలంటే తనకు అసహ్యమని ఆడమ్స్ పేర్కొన్నారు. ‘న్యూయార్క్ నగరంలో కనికరం లేని ఎలుకలపై పోరాడే శక్తి మీకు ఉందా? ఎలుకలను మీరు చాకచక్యంగా పట్టుకోగలరా? అయితే మీ కలల ఉద్యోగం రెడీగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఉద్యోగాన్ని ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ అని పిలుస్తారని మేయర్ కార్యాలయం పేర్కొంది.