చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించింది. అయితే ఈ జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనల కట్టడికి పోలీసులు పౌరులపై నిఘా పెట్టారు. నిరసనకారులను పట్టుకొనేందుకు సెల్‌ఫోన్ల లోకేషన్ డాటాను వినియోగించుకొంటున్నారు. ఒకవేళ సెల్‌ఫోన్ల సిగ్నళ్లు ఇటీవల జరిగిన ఏదైనా ఆందోళన ప్రాంతానికి దగ్గరగా ఉన్నట్టు గుర్తిస్తే, పోలీసుల నుంచి నిరసనకారులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సీఎన్‌ఎన్ నివేదించింది.