టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. రోహిత్ మరో నాలుగు సిక్స్ లు కొడితే అంతర్జాతీయ క్రికెట్ లో 500 సిక్సర్లు పూర్తి చేసుకుంటాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఒక్కడే రోహిత్ శర్మ కంటే ముందు ఉన్నాడు. క్రిస్ గేల్ 551 ఇన్నింగ్స్ లో 553 సిక్సర్లు కొట్టగా, రోహిత్ శర్మం కేవలం 443 ఇన్నింగ్స్ లో 496 సిక్సర్లు బాదేశాడు. కాగా, క్రికెట్ నుండి క్రిస్ గేల్ దాదాపుగా తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో గేల్ రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టే అవకాశం ఉంది.