చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్, కరోనా ఆంక్షలతో ఇప్పటికే ప్రజల్లో అశాంతి నెలకొంది. మరోవైపు చైనా అధ్యక్షుడి మొండి పట్టుదల ఆ దేశ ప్రజల ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది. కరోనాపై పాశ్చాత్య టీకాలను అంగీకరించే విషయంలో జిన్ పింగ్ మొండిగా వ్యవహరిస్తున్నారని నేషనల్ ఇంటెలిజెన్స్ అమెరికా డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ అన్నారు. కాగా, చైనా ఇప్పటివరకూ దేశీయంగా ఉత్పత్తి అవుతున్న టీకాలనే ఉపయోగిస్తోంది. ఇవి కరోనాపై అంతగా ప్రభావం చూపడం లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది.