ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ చేస్తోందన్నారు. జలుమూరు మండలం రామయ్యవలస గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు మూడున్నరేళ్ల పాలనలో చేకూరిన లబ్ధిని తెలియ జేస్తూ బుక్ లెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శిమ్మ నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకుడు కొర్ను రాజు కృష్ణదాస్ తో మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటంటికీ కుళాయిలు లేక ప్రజల ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే స్పదిస్తూ సచివాలయ నిధులు రూ. 20 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు బిల్లు మంజూరు చేయాలని జమ్మాన నరసమ్మ, మురుగు నీరు నిలిచిపోతోందని పొన్నాన శ్రీదేవి, సరస్వతిలు కృష్ణదాస్ దృష్టికి తీసుకురాగా వెంటనే సచివాలయ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అంచనాలు వేయాలని ఆదేశించారు.