కోడూరు మండల పరిధిలోని హంసలదీవి సాగరతీరంలో ఆదివారం యాత్రీకుల సందడి నెలకొంది. పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన పర్యాటకులు హంసలదీవి బీచ్ లో స్నానాలు ఆచరించి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దర్శనం చేసుకున్నారు. భారీ వాహనాల్లో యాత్రికులు కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లా నుంచి తరలించారు.