ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, నక్సలైట్లకి మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. బీజాపుర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే నక్సలైట్లతో ఎదురుకాల్పులు జరిగిన సమయంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో కొన్ని అమెరికాలో తయారైనవి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వీటిలో ఒకటి అమెరికాలో తయారైన ఎం1 కార్బైన్ తుపాకి ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు. బ్యారెల్ చిన్నగా ఉండడంతో ఇతర అసాల్ట్ రైఫిళ్లతో పోలిస్తే దీన్ని నిర్వహణ చాలా సులభమని పేర్కొన్నారు. దీన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.