ఇండోనేషియాలోని ఎత్తైన అగ్నిపర్వతం Mt Semeru ఆదివారం లావాను వెదజల్లుతూ పేలింది. తాజా విస్ఫోటనంలో భారీ బూడిద మేఘాలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. దీంతో తూర్పు జావా ప్రావిన్స్‌లోని అగ్నిపర్వతం చుట్టూ నివసిస్తున్న ప్రజలను అక్కడి ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. అగ్నిపర్వతం నుండి 8 కిమీ దూరంలో ఎవరూ ఉండకుండా ప్రజలను తరలిస్తున్నారు. ఈ అగ్నిపర్వతం ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంది. ఇది రాజధాని నగరం జకార్తాకు తూర్పున 640 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగ్నిపర్వతం పొగలు కక్కుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.