'పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలియదు. అతను ఒక డ్రామా యాక్టర్‌గా, ఒక ఫైటర్‌గా మాత్రమే నాకు తెలుసు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. . ఎందుకంటే.. తిరుపతి నుంచి ఎగిరి నెల్లూరులో దూకే సినిమాలు తీస్తారు. ఆయన గ్రాఫిక్స్ సినిమాల్లో నటిస్తారు. అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో కూడా అతనికి తెలియదు. పాపం అతన్ని తీసుకొచ్చి చంద్రబాబు వాడుకున్నారు'. అని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.
'చంద్రబాబు త్వరలోనే పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు పొడుస్తారు. అది తెలియక.. పవన్ కళ్యాణ్ చంద్రబాబును నమ్ముకొని తిరుగుతున్నారు. అందుకే ప్రజలు ఆయన్ను నమ్మడం లేదు. అసలు పవన్ కళ్యాణ్‌కు రాజకీయమే తెలియదు. ఒకరోజు చెప్పు చూపిస్తాడు.. ఒక రోజు కాలు చూపిస్తాడు.. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడే పిచ్చోళ్లతో నాకే పని' అని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కీలక కామెంట్స్ చేశారు. అంతేకాదు.. కంపెనీల గురించి మాట్లాడారు. 'బ్యాటరీల కంపెనీని మేము ఇక్కడి నుంచి పంపించలేదు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది వారి ఇష్టం. దాంతో మాకేంటి సంబంధం. ఈ రాష్ట్రం నుంచి ఒక్క కంపెనీ కూడా ఎక్కడికీ పోదు. ఎవ్వరు ఏం బాధ పడాల్సిన అవసరం లేదు' అని నారాయణ స్వామి స్పష్టం చేశారు.