ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కేంద్రం నేడు (సోమవారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జయశంకర్లు కూడా ఈ మీటింగ్లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది జరగనున్న జీ20 సదస్సుకు సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను కూడా ప్రధాని మోడీ ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే.