ఏపీ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం కలకలం రేపుతోంది. తాజాగా పే అండ్ అకౌంంట్స్ విభాగంలో పనిచేస్తూ పదేళ్లలోపు సర్వీసు ఉన్న 17 మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. అంతే కాకుండా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న మరో 300 మందిని తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగతా విభాగాల్లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 60 వేల మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.