ఈ నెల 13న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ ఆమోదం కోసం పంపే ప్రతిపాదనలను ఆయా శాఖల అధికారులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా నిర్ధేశించిన విధంగా పంపాలని ఆదేశిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతికి సంబంధించిన నివేదికను కూడా సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.